నేడు మండలంలో ఇండ్ల పట్టాల పంపిణీ
పామూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్ : వైఎస్సార్ జగనన్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 27న మండలంలోని 8 గ్రామాల్లో జరుగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్ రెడ్డి తెలిపారు . స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాలను లబ్దిదారులకు అదివారం ఉదయం వగ్గంపల్లె గ్రామంలో 10 గంటలకు , చింతలపాలెంలో 11.30 లకు , బుక్కాపురంలో 12.30 లకు , దూబగుంట్లలో మద్నాహ్నం గం 1.30 లకు , ఇనిమెర్లలో 3 గంటలకు , కంబాలదిన్నెలో 4 గంటలకు , అయ్యవారిపల్లె , అయ్యన్నకోట గ్రామాల్లో సాయంత్రం 5 గంటలకు పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . కార్యక్రమానికి లబ్దిదారులు అయా లేఅవుట్ల దగ్గర హాజరుకావాలని ఆయన కోరారు . సమావేశంలో పార్టీ నాయకులు కల్లూరి రామిరెడ్డి , గట్‌లో విజయబాస్కర్ రెడ్డి , గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి , జి.రవీంద్రబాబు , బారాషరీఫ్ ఉన్నారు.