ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు

ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు
పామూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్ : 25/12/20క్రిస్మస్ పర్వదిన వేడుకలను పట్టణంతోపాటు మండలంలోని క్రైస్తవ సోదరులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా స్థానిక సీఎస్ పురం రోడ్డులోగల తెలుగు బాప్టిస్ట్ చర్చితోపాటు కందుకూరు రోడ్డులోగల సీయోను ప్రార్థనా మందిరం , నెల్లూరు రోడ్డు , అంకాలమ్మవీధి , మండలంలోని మోపాడు , మోట్రావులపాడు , వగ్గంపల్లి , గుమ్మనంపాడు , కంబాలదిన్నె ట్రినిటి బాప్టిస్టు చర్చితోపాటు పలు చర్చీల్లో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . మోపాడు చర్చిలో ఫాస్టర్ జైరాజ్ , వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్ రెడ్డి , జడ్పీటీసీ అభ్యర్థి చప్పిడి సుబ్బయ్యలు కేక్ కోసి పంచిపెట్టారు . క్రిస్మస్ సందర్భంగా సంఘ కాపరులు ఆయాగ్రామాలలోని చర్చిలలో దైవ వర్తమానాన్ని వివరించారు . కార్యక్రమంలో ఫాస్టర్ ఆర్.జోసఫ్ , వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి రామిరెడ్డి , గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి , జి.రవీంద్రబాబు , గట్లా విజయబాస్కర్ రెడ్డి , కోటపాటి రవికుమార్‌ రెడ్డి పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *