పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం మాదాసి వెంకయ్య
మర్రిపూడి డిసెంబర్ 25 న్యూస్ మేట్ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకం దేశంలోనే అద్భుతమైన పథకం అని కొండపి వైసీపీ ఇన్ చార్జ్ మాదాసి వెంకయ్య అన్నారు. శుక్రవారం మరిపూడి మండలం అంకేపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.