ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు

ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు25/12/20
ఒంగోలు టౌన్ డిసెంబర్ 25 న్యూస్ మేట్ :  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం లో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించారు, అదేవిధంగా కరోనా తో మరణించిన పార్టీ కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు ఆర్థిక సహాయం అందించారు. మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని ఎటువంటి సందర్భంలోనైనా నేను మీకు అన్నివిధాలా అండగా ఉంటానని పార్టీ పటిష్టతకు కార్యకర్తలు అన్ని గ్రామాలలో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *