మీ వెంట నేనుంటా అధైర్య పడకండి

మీ వెంట నేనుంటా అధైర్య పడకండి25/12/20
ఒంగోలు టౌన్ డిసెంబర్ 25 న్యూస్ మేట్ : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్మశాన స్థలాలను నివేశ స్థలాలు గా ఇస్తున్న వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆయన శుక్రవారం ఒంగోలు మండలం కొండాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏడుకొండలు కుటుంబంలో జరిగిన శుభకార్యానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామానికి నెల రోజుల నుండి త్రాగు నీరు రావడం లేదని అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న పట్టాలు అధికార పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారని ,జనార్ధన్ కు వివరించారు. గ్రామంలో 7అక్రమాల గురించి ఉన్నత అధికారులతో చర్చించి గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని జనార్ధన వారికి హామీ ఇచ్చారు. మీ వెంట నేను ఉంటా ధైర్యంగా ఉండండి సమస్యలపై పోరాడి పరిష్కరించుకుందాం అంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిటిసి ఎర్రం శ్రీనివాసరావు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *