ఘనంగా వాజ్పాయ్ జన్మదిన వేడుకలు

ఘనంగా వాజ్పాయ్ జన్మదిన వేడుకలు 25/12/20
కందుకూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పాయ్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని బిజెపి కందుకూరు పట్టణ కన్వీనర్ కళ్యాణ్ అన్నారు. వాజ్పాయ్ 96వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక బిజెపి కార్యాలయంలో వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు జరిగాయి .ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ వాజ్పాయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ రహదారుల విస్తరణ నదుల అనుసంధానం వంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారని అన్నారు . ఆయన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించిందని ఆయన అన్నారు. మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినా అతి సామాన్య వ్యక్తి గా ఉండటం ఆయనకి ఇష్టం అని కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లో బిజెపి నాయకులు భూసయ్య సిహెచ్ పాండురంగారావు రాఘవులు హరిబాబు కే మల్లికార్జున రావు అజయ్ రెడ్డి కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *