ఘనంగా సిపిఐ 96 వ ఆవిర్భావ దినోత్సవం
వలేటివారిపాలెం డిశంబరు 26 న్యూస్ మేట్ : నేటి పాలకుల తీరు ప్రజలను వంచన చేస్తున్నాయని సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య అన్నారు. సిపిఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం వలేటివారిపాలెం లో జెండా ఆవిష్కరణ అనంతరం ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు పి బాలకోటయ్య అధ్యక్షతన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ నేటి పాలకుల విధానాలు భారత దేశాన్ని ఆర్థికంగా దిగజారు స్తున్నాయని అన్నారు. మోడీ పాలన కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారిందని అన్నారు .ముప్పై నాలుగు రోజుల నుండి ఢిల్లీలో రైతు శాంతియుత నిరసన చేస్తున్నా మోడీ ప్రభుత్వం కనీసం చర్చలకు ఆహ్వానించక పోవడం ఆయన నిరంకుశత్వాన్ని ఎత్తి చూపుతుందని ఆయన విమర్శించారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటున్న కమ్యూనిస్టు పార్టీ 95 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో పోరాటాలు జరిగాయి అని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలపై ఆయన ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామమ్మ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ ఏఐటియుసి నియోజకవర్గ సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ సిపిఐ నాయకులు సీతారామయ్య రవికుమార్ ప్రజాసంఘాల నాయకులు లింగాబత్తిన బాబురావు తదితరులు పాల్గొన్నారు.