95 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు

95 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు

కందుకూరు డిసెంబర్ 26 న్యూస్ మేట్ : 26/12/20
95 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సిపిఐ ఎన్నో పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామమ్మ అన్నారు. సిపిఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జెండా ఎగరవేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం నుండి కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించి వేల ఎకరాలు పంపిణీ జరిగింది అని ఆమె అన్నారు. ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రానికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆమె విమర్శించారు. దేశంలో నరేంద్ర మోడీ , రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రజా కర్షక పథకాలతో తాత్కాలికంగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆమె అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా బడుగు బలహీన వర్గాలకు జరిగిందేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న నివేశన స్థలాల పంపిణీ లో అధికార పార్టీకి చెందిన వారికే స్థలాలు దక్కుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. సురేష్ బాబు ,ఏ ఐ టి యు సి కందుకూరు నియోజకవర్గ అధ్యక్షులు పి బాలకోటయ్య, సహాయ కార్యదర్శి హుస్సేన్ ,ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్, కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష ,కార్యదర్శులు కే. హరి బాబు, బి . చంద్రమోహన్, కోశాధికారి వై విశ్వనాథం , నాయకులు ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం నాయకులు చేవూరి దుర్గా ప్రసాద్ ఏఐటీయూసీ నాయకులు సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *