జగనన్న నివాస స్థలాలు పంపిణీ
గుడ్లూరు డిసెంబర్ 26 న్యూస్ మేట్ : మండలంలోని దారకా ని పాడు గ్రామం లోని జగనన్న నివాస స్థలాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో మండల అభివృద్ధి అధికారి ఎం వెంకటేశ్వర్లు మరియు తాసిల్దార్ శ్రీ శిల్ప చేతుల మీదగా గ్రామంలోని లబ్ధిదారులకు శనివారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దార కాని పాడు మాజీ సర్పంచ్ సిహెచ్ మాధవరావు మరియు మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్ నరసింహారావు వీరు మాట్లాడుతూ నిరుపేదల సొంత ఇల్లు కల నెరవేరుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ఏ ఈ ఎస్కే గౌస్ బాష మరియు ఆర్ ఐ శ్రావణి తో పాటు వైసిపి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ద్వారకానిపాడు గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు అనంతరం కార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు వాలెంటర్ల్లు మహిళా పోలీసులు వివిధ శాఖల వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.