మద్యం విక్రయాలకు ఆంక్షలు

మద్యం విక్రయాలకు ఆంక్షలు
ఒంగోలు డిశంబరు 26 న్యూస్ మేట్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో ఈనెల 31వ తేది మరియు 2021 జనవరి ఒకటో తేదీన ఆంక్షలతో కూడిన విక్రయాలకు అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రకటించారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో నిర్ణయించిన వాణిజ్య సమయాలలో తప్ప మిగతా సమయాలలో విక్రయాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లేఖ నెంబర్- 34 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుని అన్ని జిల్లాలకు ఆదేశాలు పంపిందన్నారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో మద్యం విక్రయాలు ఆ రెండు రోజులలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కలెక్టర్ సూచించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *