రైతు కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమం

రైతు కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమం

• రైతు ఆత్మహత్యల గురించి పట్టని ప్రభుత్వం

• రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

• వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం అన్యాయం

• నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వ విఫలం26/12/20

 

ఒంగోలు డిశంబరు 26 న్యూస్ మేట్ :  నివర్ తుఫాన్ వల్ల నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ మూడు రోజులపాటు అనగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో “రైతు కోసం” ఉద్యమం చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. పైర్లు సరిగా పండక అప్పుల్లో కూరుకుపోయి అప్పులు తీర్చలేక వీటితో పాటు నివర్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్టైనా లేదని ఆయన విమర్శించారు. రైతులకు అవసరమైన సమయంలో ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన ఎద్దేవా చేశారు. నివర్ తుఫాను వలన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలం చెందారని, ఈ క్రాపింగ్ విధానంలో నష్టపోయిన రైతుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు కాలేదని, మరీ ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందించాల్సినటువంటి విద్యుత్తుకు సంబంధించి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం అన్యాయమని, ఇది రైతులను దగా చేయడమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించామని, కానీ ఈ ప్రభుత్వం నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినటువంటి రైతులకు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోమని చెప్పిన ఈ ప్రభుత్వం తుఫాన్ వచ్చి వెళ్లి నెల దాటినా రైతులకు పూర్తిస్థాయిలో అన్యాయం చేస్తూ ఇప్పటివరకు ఈ క్రాపింగ్ పూర్తి చేయలేదని ఇది రైతుల దగా చేయడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్టపోయిన రైతులకు కాలయాపన చేయకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క రైతు పంట బీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా ఎందుకు చెల్లించలేక పోయారని, దాని ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం ముందుగా మేలుకొని రైతుకు భరోసా కల్పించినట్లైతే నేడు రైతుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, రైతులు పెద్దఎత్తున 3 రూ నుంచి 5 రూ వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేశారని వారు రైతులని మోసం చేయడం తగదని హితవు పలికారు. శాసన సభలో చంద్రబాబు రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారా అని అడిగితే కట్టామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు మీరు కట్టలేదు అని చంద్రబాబు గారు రైతులు బాధలో ఉన్నారు అని ఆవేదనతో నేల పై కూర్చుంటే అప్పుడు అర్ధరాత్రి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించారని, సున్నా వడ్డీ అన్నారు ముందు వడ్డీ డబ్బులు కట్టమన్నారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటడం లేదు అని ఎద్దేవా చేశారు. అసలు ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు రైతు భరోసా కేంద్రాలు అంతా ఉ త్త బోగస్ కేంద్రాలు. 25 బస్తాలు మాత్రమే కొంటారంటా మరీ మిగితా బస్తాలు ఏమి చేయాలి అని ఆయన ప్రశ్నించారు. గ్రామాలు తిరిగొచ్చి చెబుతున్నాను, వాస్తవాలు అర్ధం చేరుకొండి, అప్పులు తీసుకొచ్చి మాట పడలేక రైతు ప్రాణ త్యాగం చేస్తున్నాడు తెలుగుదేశంపార్టీ రైతుకు ధైర్యం చెప్పేందుకే రైతు కోసం ఉద్యమాన్ని 3 రోజులపాటు నిర్వహించబోతుందని, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్నీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *