ప్రజా పోరాటాలకు పునరంకితమవుదాం సిపిఐ 95 వ వ్యవస్థాపక కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకట్రావు

ప్రజా పోరాటాలకు పునరంకితమవుదాం సిపిఐ 95 వ వ్యవస్థాపక కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకట్రావు

26/12/20
కొత్తపట్నం డిసెంబర్ 26 న్యూస్ మేట్ : ప్రజాపోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ పునరంకితం అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకట్రావు అన్నారు. సిపిఐ పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని కొత్తపట్నం పార్టీ కార్యాలయం పార్టీ జెండా ను మాజీ ఉధ్యోగి నారాయణ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో 1925 డిసెంబర్ 26 వ తేదీన బొంబాయి నగరంలో కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి తిండి,బట్ట,గూడు, వైద్యం,విద్య,కనీస అవసరాల కోసం మడమతిప్పని పోరాటాలు కొనసాగిస్తున్నదన్నారు.కార్మికులకు పని గంటల కోసం, కనీస వేతనాలు అమలు కోసం కార్మిక హక్కుల కోసం,పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఎన్నో ప్రజా పోరాటాలను చేస్తూనే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తో పోరాడి దేశానికి స్వతంత్రము ఇవ్వాలని నినాదాన్ని మొట్టమొదట కమ్మూనిస్టులే ఇచ్చారన్నారు. అలాగే భారత ప్రజానీకం అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు,సదుపాయాలు,కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమే అన్నారు. బూర్జువా భూస్వామ్య ప్రభుత్వాలతో ఎమర్జెన్సీ రూపంలో ప్రజల పక్షాన ఉండి పోరాడి ప్రజాస్వామిక సమసమాజ రాజ్యం కోసం కృషి చేస్తూనే ఉన్నదన్నారు. కేంద్రంలో మతతత్వ బిజెపి వచ్చిన తర్వాత భారత ప్రజల పై సర్జకల్ స్ట్రైక్ చేస్తూ, ప్రజలపై మూకుమ్మడి దాడికి పాల్పడుతున్నదన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తూ, న్యూ వేజ్ కోడ్ తో హక్కులను కాలరాస్తూ, వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ, అన్ని రంగాలు నిర్వీర్యం చేస్తూ,కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా పాలన సాగిస్తున్నారు, ఈ విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ గా రానున్న రోజుల్లో ఉద్యమం చెయాలి అన్నారు.బస్టాండ్ సెంటర్ లో ఉన్నా జెండాను కిష్టం.పిచ్చియ్యా,స్తూపం దగ్గర జెండా ను కట్టా.ఆంజనేయులు,రెడ్డిపాలెం లో జెండాలను పురిణి.శ్రీహరి,గునిమిని సుబ్బారెడ్డి జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పురిణి.గోపి,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులుయమ్.విజయ,వెంకటేశ్వర్లు,నాగరాజు,కుమ్మరి.కోటిరెడ్డి,మల్లవరపు.ప్రసాదు,కోటమ్మ,జాజుల.జలారాం,పాపారావు,గునిమిని సుబ్బారెడ్డి, నారాయణ,కట్టా.ఆంజనేయులు, బేతాళ.కోటేశ్వరరావు,బద్దపూడి.సైమన్,పార్టీ సీనియర్ కామ్రేడ్ తంబి.వెంకటరంగం,పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *