నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేరింది ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.
వలేటివారిపాలెం.డిశంబరు 26 న్యూస్ మేట్ :ఎన్నో ఏళ్ల సొంతింటి కల నెరవేరిందని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని కొండసముద్రం గ్రామంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో నిరుపేద కుటుంబాలకు సొంతింటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కేవలం ఇంటి స్థలాలే కాక ఇంటిని నిర్మించి ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అయ్యిందని అన్నారు. కొండ సముద్రం గ్రామంలో 82 లేఔట్లకు గాను 77 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముజఫర్ రెహమాన్, ఎంపీడీవో రఫిక్ అహ్మద్, ఎస్సై చావా హజరత్తయ్య, ఏపీడి ఎం సుభాషిని, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, మండల సర్వేయర్ శ్రీలక్ష్మి, ఆర్ ఐ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, వైసిపి నాయకులు మన్నం వెంకట రమేష్, హరిబాబు, పొడపాటి నరసింహం, అనుమోలు లక్ష్మీనరసింహం, వెంకటేశ్వర్లు, వీరాస్వామి, కట్టా హనుమంతరావు,యాళ్ల శివ కుమార్ రెడ్డి,ఇరపని అంజయ్య,కుంబాల క్రాంతి,ఉన్నం వెంకటేశ్వర్లు, మండలంలోని వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది,వలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.