నిమ్న జాతులకు అండ ఎర్ర జండా ..

నిమ్న జాతులకు అండ ఎర్ర జండా ..

26/12/20
కొండపి డిసెంబర్ 26 న్యూస్ మేట్ : పేద మధ్యతరగతి ప్రజలకు అండగా సిపిఐ జెండా నిలుస్తుందని సిపిఐ కొండేపి నియోజకవర్గ కార్యదర్శి వీరారెడ్డి అన్నారు. శనివారం కొండపి మండలం లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొండేపి, నేతివారిపాలెం గ్రామాల్లో పార్టీ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ కొండేపి నియోజకవర్గ కార్యదర్శి వీరా రెడ్డి మాట్లాడుతూ 1925వ సంవత్సరం లో భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో మొట్టమొదటి గా ఏర్పాటు జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పేద ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బ్యాంకులు, రైల్వేలు, ఎల్ఐసి లాంటి సంస్థలను పోరాడి ప్రభుత్వ పరం చేస్తే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టిపెట్టి కార్మికులను నిరుద్యోగులుగా తయారు చేస్తున్న సంఘటన భారత దేశంలో జరుగుతుంది. ఆయిల్ కంపెనీల మీద పెత్తనం ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి రోజువారీ సమీక్ష పేరుతోటి పెట్రోల్, డీజిల్ ధరలను దేశంలో కనీవిని ఎరుగని స్థాయిలో అత్యధిక ధరకు పెంచిన నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్ గా మారారని అన్నారు. వ్యవసాయ రంగంలో మూడు నూతన బిల్లులతో పాటు, 2020 విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి రైతు, రైతు కూలీల బతుకు కార్పొరేట్ చేతుల్లో పెట్టారు అని అన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా గత 25 రోజులుగా దేశంలోని రైతాంగం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఏమాత్రం చలించని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా దేశంలో 700 బహిరంగ సభ పెట్టడం ద్వారా క్రూరంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడి చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం గురవయ్య, కొమ్ము రమేష్ , లక్ష్మీ, బ్రహ్మయ్య, సోమయ్య , వెంకటే�

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *