పేదల పక్షపాతి సిపిఐ
మార్కాపురం డిసెంబర్ 26 న్యూస్ మేట్ : పోరాటాలతో పునీతమైన భారత కమ్యూనిస్టు పార్టీ 95 సంవత్సరాలుగా పేదల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు నిర్వహించిందని సిపిఐ మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య అన్నారు .సిపిఐ 96 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలో అనేక ప్రాంతాలలో సిపిఐ పతాకాలను ఎగురవేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో చట్టసభల్లో సిపిఐ తనదైన పాత్ర నిర్వహిస్తుందని అన్నారు. పేద ధనిక తేడా ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుందని ఆయన అన్నారు. పాలకుల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల బాట పడుతుందని ఆయన తెలిపారు. నేటి పాలకులు ప్రజా పాలన కొనసాగించడం లేదని ఆయన విమర్శించారు .ఎర్ర జండా రాజ్యం కోసం పేదలంతా చైతన్యవంతులై ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం కార్యకర్తలు పాల్గొన్నారు.