ఎస్టీలకు విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తున్న కనిగిరి ఎంఈఓ : ప్రజా హక్కుల వేదిక

ఎస్టీలకు విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తున్న కనిగిరి ఎంఈఓ : ప్రజా హక్కుల వేదిక

28/12/20

కనిగిరి డిసెంబర్ 28 (న్యూస్ మేట్) :  కనిగిరి నగర పంచాయతీలోని బొగ్గుల గొంది కాలనీ లోని ఎస్టి వాడలోని శివాజీ ఓరియంటల్ ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసే దిశగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజా హక్కుల వేదిక అధ్యక్షులు ధూళిపాళ్ళ మల్లికార్జునరావు అన్నారు. సోమవారం ఆయన ప్రజా హక్కుల వేదిక కార్యాలయంలో మాట్లాడుతూ కనిగిరి నగర పంచాయతీ లోని బొగ్గుల గొంది కాలనీ ఎస్టి వాడాలో శివాజీ ఓరియంటల్ ఎయిడెడ్ పాఠశాలను మూసి వేసే విధంగా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారని 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో విద్యార్థులు లేరని పై అధికారులకు నివేదిక లు పంపించి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయు లు వేరే చోటికి బదిలీకి ప్రయత్నిస్తున్నారు . మూడు నెలల్లో ఒక ఉపాధ్యాయుడు పదవి విరమణ చేస్తుండగా ఉన్న ఒక ఉపాధ్యాయుడు బదిలీకి ప్రయత్నిస్తున్నారు. పాఠశాల మూసివేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ ఎస్టీలు చదువుకోవడమే కష్టంగా ఉన్న సందర్భంలో ఉన్న ఒక్క స్కూలు మూసివేస్తే ఎక్కడికి పంపించాలని ఆయన అన్నారు. శివాజీ పాఠశాలకు సొంత భవనాన్ని కేటాయించి దానిని మున్సిపాలిటీ కి ఇవ్వాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్, ఆర్జెడి పాఠశాలను పరిశీలించి పాఠశాల ను మూసి వేయ కుండా చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని అన్నారు. ఉపాధ్యాయులు పెట్టుకున్న బదిలీలను ఉపసంహరించుకోవాలని స్కూలు మూసివేసే కార్యక్రమంలో ఉపాధ్యాయుల బదిలీలకు అనుకూలంగా అధికారులకు సిఫార్సు లేఖలు రాసిన ఎంఈఓ ఆ చర్యలు మానుకోవాలని ఎంఈఓ వెంటనే ఉన్నతాధికారులతో చర్చించి పాఠశాలను మూసి వేయకుండా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎం ఈ ఓ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని ప్రజా హక్కుల వేదిక హెచ్చరించింది. స్థానిక శాసనసభ్యులు కలుగచేసుకుని పాఠశాల మూసి వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేసి విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేస్తూ ఉంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *