రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు చర్యలు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ

రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు చర్యలు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ

28/12/20
కందుకూరు డిసెంబర్ 28 న్యూస్ మేట్ :  కందుకూరు పట్టణం లో 865 1A 1A 2A1 సర్వేనెంబర్లలో జూలై నుండి రిజిస్ట్రేషన్ ఆగిపోయిన విషయం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని సిపిఐ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పి బాలకోటయ్య తెలిపారు. పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆగిపోయిన విషయం సబ్ కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం అందించినట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆగిపోయి అనేకమంది శుభ కార్యాలు విద్య వైద్యం వంటి అత్యవసర కార్యక్రమాలకు తమ స్థలాలు తాకట్టు పెట్టి, విక్రయించడం ద్వారా అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని సబ్ కలెక్టర్ కి వివరించినట్లు ఆయన తెలిపారు సబ్ కలెక్టర్ స్పందిస్తూ రిజిస్ట్రేషన్ ఆగిపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని త్వరలోనే పరిష్కరిస్తారని రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు సత్వరమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు బాలకోటయ్యతెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *