పెంచిన పన్నులు తగ్గించాలి సిఐటియు డిమాండ్
కందుకూరు డిసెంబర్ 28 న్యూస్ మేట్ : రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న ఆస్తి పన్నులను తగ్గించాలని కోరుతూ సోమవారం సి ఐ టి యు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించారు .ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మువ్వా కొండయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి జనాన్ని అతలాకుతలం చేసి జనం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచటం మూలిగే నక్క మీద తాటి మట్ట పడటం అని ఆయన విమర్శించారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. పెంచిన పన్నులు తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామ్మూర్తి సిఐటియు నాయకులు గౌస్ మహిళా సంఘం నాయకులు మున్వర్ సుల్తానా మనోజ తదితరులు పాల్గొన్నారు.