అనర్హులకు ఇళ్ల స్థలాలా..?

అనర్హులకు ఇళ్ల స్థలాలా..?
– ఒక ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో రాజకీయంగా గందరగోళం

– పట్టణానికి దూరం కావడంతో కూలీలకు అదనపు భారం

– పశువుల బీడు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ప్రశ్నార్ధకంగా మారిన పశువుల కాపరుల జీవితాలు

28/12/20

పామూరు నెంబర్ 28 (న్యూస్ మేట్): పేదల కోసం ఇచ్చిన ఇంటి నివేశన స్థలాలు ఒకే చోట ఇస్తుండడంతో రాజకీయంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని దీని వలన గ్రామాల్లో వర్గ విబేధాలు వచ్చే అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. పామూరు మండలంలోని వగ్గంపల్లి, గుమ్మళంపాడు గ్రామాల్లో లబ్ధిదారులు, అనర్హుల జాబితా, తిరస్కరించబడిన జాబితాలు కోరుతూస్థానిక తహశీల్దారు కార్యాలయంలో సమాచార హక్కు చట్టం మేరకు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామూరు పట్టణంకు చెందిన వారికి కూడా ఎక్కడో పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పట్టణానికి చెందిన వారు అక్కడ నివాసం ఉంటే వారు ఉపాధి కోసం తిరిగి పట్టణానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా దూర ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం వలన వారికి అదనపు భారం అయ్యే అవకాశం ఉంటుందన్నారు.కొన్ని గ్రామాల్లో పశువుల బీడు భూముల్లో ప్రభుత్వ లే అవుట్ లు వేయడం వలన పశువులు, జీవులు తిరిగేందుకు అవకాశం లేకుండా పోవడంతో పాటు పశుపోషకులు పశువులను మేపుకునేందుకు అనేక సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఒక గ్రామంలో ఉన్న ప్రజలకు ఆ గ్రామంలో కాకుండా వేరే గ్రామంలో ఇళ్ళ స్థలాలు కేటాయింపుల వలన భవిష్యత్తులో రాజకీయ పరంగా, సామాజిక వర్గాల పరంగా కూడా అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరగగా,నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ వారు చెప్పిన వారికి పంట నష్టం రాస్తూ,పంట వేయని వారికి కూడా నష్ట పరిహారం చెల్లించేందుకు జాబితాలు సిద్ధం చేసారని కొందరు రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాస్తవికంగా నష్టపోయిన రైతులకు అధికారులు, నాయకులు కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోతే రైతుల పక్షాన ఎంత వరకు అయినా వెళతానని ఆయన తెలిపారు. ఆయన వెంట మాజీ సింగిల్ విండో ఛైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి,మాజీ జడ్పీటీసీ సభ్యులు మోరుబోయిన హుస్సేన్ రావు, నర్రమారెళ్ళ మాజీ ఉపసర్పంచ్ గుంటుపల్లి శ్రీనివాసులు, జిల్లా షీప్ సొసైటీ డైరెక్టర్ గంగరాజుయాదవ్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఖాజారహంతుల్లా, మాజీ వర్క్ బోర్డు డైరెక్టర్ అర్. అర్. రఫీ, మాజీ సర్పంచ్ కావేటి సుబ్బయ్య, మార్నేని రామకృష్ణ, పోకా నాయుడు, తమ్మనేని శ్రీనివాసరెడ్డి, షేక్ జంషీర్, ఎం.గిడ్డయ్య, మట్లె రాహుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *