రైతుల ఆత్మహత్యలు ఆపటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

రైతుల ఆత్మహత్యలు ఆపటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం28/12/20

ఒంగోలు డిసెంబర్ 28 న్యూస్ మేట్ :  రైతులే దేశానికి వెన్నెముక అంటాం. రైతు సుభిక్షంగా ఉన్నపుడే రాజ్యం సంతోషంగా ఉంటుందంటారు. అలాంటి రాష్ట్రంలో గత 19 నెలల్లో 756 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా అసంఖ్యాకంగా రైతు ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అని బాపట్ల పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య అన్నారు .రైతుల ఆత్మహత్యలపై సోమవారం ఆర్డిఓ ని కలిసి టిడిపి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా ప్రీమియం సకాలంలో చెల్లించడం లేదు. పంట పరిహారమూ ఆలస్యంగా, అరొకర మందికి మాత్రమే అందుతోంది. నష్టపోయిన పంటని అంచనా వేయడంలో ప్రభుత్వం తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి అని ఆయన విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం యొక్క ప్రభావం రైతుల జీవితాలపై తీవ్ర స్థాయిలో చూపిస్తోంది. పంటల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు రైతుల్ని ఇంకా అప్పుల ఊబిలో నెట్టేస్తున్నాయి. రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి పెద్ద పెద్ద ప్రకటనలు వేసుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవ పరిస్థితుల విషయంలో మాత్రం ఎనలేని నిర్లక్ష్యం చూపుతోంది అని ఆయన దుయ్య బట్టారు.ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు గత ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారంగా అందించేది. ప్రస్తుత ప్రభుత్వం దీనిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా వాలంటీర్లు, వైసీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే అందిస్తున్నారని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని అందించడంలో ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వం వారిని మరింత నిస్సహాయతకు గురి చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారంలోనే బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలి. అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలి అని వెంకయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *