ఆ రాజకీయ బాటసారి అలు పెరుగరు….
కందుకూరు డిసెంబర్ 28 న్యూస్ మేట్:- ఆ రాజకీయ బాటసారికి అలుపు ఎలా ఉంటుందో తెలియదు.ప్రజల కొరకు ప్రజల మధ్య సమయంతో నిమిత్తం లేకుండా ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ప్రజల మధ్య నడిచే బాటసారి అనటంలో అతిశయోక్తి లేదు.1989లో తన తండ్రి మరణానంతరం శాసనసభలో అడుగుపెట్టిన ఆయన 2004 2009 2019 లో శాసనసభ్యుడిగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా చేశారు. 2019 కోవిడ్ లో ఆయన కనపరిచిన సేవా కార్యక్రమాలు యావత్ ప్రజానీకం అభినందించక తప్పదు.రాజకీయ చాతుర్యం, నేర్పరి అయిన మహీధర్ రెడ్డి తాను అనుకున్నది సాధించడంలో దిట్ట. కరోనా సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి ఆదర్శంగా నిలిచాయి. కరోనా విజృంభిస్తుంది ప్రజలంతా ఇళ్లలో నుండి బయటకు రావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసినా ఆయన మొక్కవోని ధైర్యంతో కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు కంకణ బద్ధుడయ్యారు .మార్చిలో కరోనా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నాటి నుండి లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఆయన ప్రజలకు అందించిన సేవా కార్యక్రమాలు మరొకరు చేసి ఉండరేమో. ఇంటి నుండి ఉదయం ఆరు గంటలకు బయటకు వస్తే రాత్రి ఏ సమయం అవుతుందో చెప్పలేము .లాక్ డౌన్ లో పనులు లేక ఇంటి నుండి బయటకు రావటానికి అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి మనిషిని ఆదుకోవడంలో ఆయన చూపిన ఐదార్యం మానవతా విలువలను ప్రతిబింబింప చేసింది. 60 సంవత్సరాల వయసులో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ అందించడమే ధ్యేయంగా ప్రజలను కరోనా మహమ్మారి ప్రమాదం నుండి రక్షించడమే ప్రధానలక్ష్యంగా ఆయన ముందుకు సాగారు. ఒకానొక దశలో పోలీసులు సైతం ప్రజలను నియంత్రించలేని పరిస్థితిలో తానే సైనికుడు గా నడి రోడ్డుపై నిలబడి లాఠీ పట్టి లాక్ డౌన్ అతిక్రమించి తిరుగుతున్న యువకులను కంట్రోల్ చేసిన తీరు ప్రశంసలందుకున్నది. ప్రయాణ సౌకర్యాలు లేక సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్న ఆయన ఆహారం మంచినీళ్లు అందించి చూపిన ప్రేమాభిమానాలు మానవత్వానికి నిలువుటద్దంగా అభివర్ణించవచ్చు .లాక్ డౌన్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవటానికి అందరి సహకారం అవసరమని భావించి విరాళాల రూపంలో సేకరించిన నిధులు పైసా దుర్వినియోగం కాకుండా ఆపదలో ఉన్న వారి కోసమే ఖర్చు చేస్తున్న తీరు ఆయన ఆర్థిక క్రమశిక్షణను గుర్తు చేస్తుంది .లాక్ డౌన్ సమయం లో ప్రభుత్వం అందించే సహాయం వెనక, ముందు అయినా ఆయన ప్రజల నుండి సేకరించిన విరాళాలతో ప్రజల నిత్యావసరాలను తీర్చారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా లాక్డౌన్ నుండి నేటి వరకు ప్రజల సమస్యల పరిష్కారం కొరకే పని చేస్తున్నారు. కరోనా సమయంలో అధికారులు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి కందుకూరు నియోజకవర్గంలో కరోనా కేసులు ఉదృతం కాకుండా నియంత్రింప చేయటంలో మహీధర్ రెడ్డి పాత్ర వర్ణనాతీతం. ప్రచార మాధ్యమాల ద్వారా పరిశీలిస్తే లాక్ డౌన్ సమయంలో ఆయన ప్రజలకు అందించిన అపారమైన సేవ కు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి ప్రశంసలు వచ్చాయి. ఒక రాజకీయ ప్రజా ప్రతినిధి నిస్వార్థ సేవలు అందిస్తే ఎలా ఉంటుందో మహీధర ర్రెడ్డి నిరూపించారు. లాక్ డౌన్ లో సేకరించిన నిధులు బహిరంగంగా ప్రకటించడమే కాక ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు నూతన ఆర్థిక నియంత్రణ ఒరవడికి నిదర్శనం. ఏ ఏ రంగాలకు అవసరమో గుర్తించి అవసరమైన మేర ఖర్చు చేస్తున్నారు .ప్రజల నుండి వసూలు చేసిన నిధులు ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నందుకు ఆయనను రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు.