డిసెంబర్ 30న ఏపీ టిడ్కో గృహాల పంపిణీ – కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు
కనిగిరి డిసెంబర్ 28 (న్యూస్ మేట్) : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ లో భాగంగా ఈనెల 30వ తారీఖున ఏపీ టిడ్ కో (జి ప్లస్ త్రీ) గృహాల పంపిణీ జరుగునని మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు అన్నారు. చాకిరాల వద్ద నిర్మించిన అపార్ట్ మెంట్లను వైసీపీ నాయకులు , కమిషనర్ డి. ఎస్.నారాయణరావు సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ లో భాగంగా బుధవారం రోజు కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ చాకిరాల వద్ద నిర్మించిన గృహాలను పంపిణీ చేస్తారని అన్నారు. లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.వార్డు వాలంటీర్ ద్వారా లబ్ధిదారులకు వారి యొక్క ప్లాట్ల వివరాల సమాచారం ప్రతి లబ్ధిదారులకు అందజేశామన్నారు . ప్రతి లబ్ధిదారుడు వారి ప్లాట్లను సందర్శించుకోవచ్చు అన్నారు .బుధవారం రోజున లబ్ధిదారులు తప్పకుండా హాజరై సేల్ అగ్రిమెంట్ తీసుకోవాలని కమిషనర్ తెలియజేశారు . ఈకార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు రంగనాయకులు రెడ్డి. లాయర్ గఫూర్. మోహన్ రెడ్డి . గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు .