ప్రజలపై పన్ను పోటు మానుకోవాలి

ప్రజలపై పన్ను పోటు మానుకోవాలి28/12/20

కనిగిరి డిసెంబర్ 28 (న్యూస్ మేట్) :  కరోనా కాలంలో ప్రజలు ఆదాయాలు పడిపోయి వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి రాయితీలు ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన పోయి పట్టణాలు నగరాల్లో పనులు పెంచాలని చట్టాలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వడం వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు పొంగిపోయి మున్సిపల్ చట్టాలను మార్చి ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని పౌర సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు విమర్శించారు ఆస్తి విలువ పై ఇంటి పన్ను వేసే విధానం రద్దు చేయాలని కోరుతూ కదిరి పట్టణంలోని రెడ్డి బిల్డింగ్స్ వద్ద ప్రజలకు అవగాహన సదస్సు సోమవారం నిర్వహించగా వారు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ 73 74 రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పన్నులు పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను పన్నుల భారాలను ప్రజల పై రుద్దటం అప్రజాస్వామికమని అన్నారు నిధులు కేటాయించకుండా స్థానిక సంస్థల అభివృద్ధిని అడ్డుకునేందుకు చూడటం దారుణమని ఇది స్థానిక సంస్థల నిర్వీర్యం చేయడమే అన్నారు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని శాసనసభలో ఏకపక్షంగా ఆమోదించిన మున్సిపల్ చట్టం సవరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు చెత్త పన్ను రద్దు చేయాలని మంచి నీరు డ్రైనేజీ ఛార్జీల పెంపుదల నిలిపివేయాలని కోరారు మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత పన్నుల విధానం పై నిర్ణయించుకునే అధికారం ఎన్నికయ్యే కౌన్సిల్ లకు ఇవ్వాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు తమ ఆదాయంలో 30 శాతం వాటా ఇవ్వాలన్నారు ప్రజా సమస్యలపై రాజకీయాలకతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనవరి 6న మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేసే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సదస్సులో పౌర సంఘాల సమాఖ్య నాయకులు పిల్లి తిప్పారెడ్డి పి సి కేశవరావు వివిధ సంఘాల నాయకులు వి మాలకొండారెడ్డి రాచమల్ల శ్రీనివాసరెడ్డి రాజు బ్రహ్మారెడ్డి విజయరామరాజు మీగడ వెంకటేశ్వర్ రెడ్డి సాయి ప్రసన్న బషీర మై మూన్ పిచ్చి రెడ్డి అచ్చిరెడ్డి కొండారెడ్డి కాదరవలి రఫీ తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *