విద్యార్థుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలి
ఒంగోలు టౌన్ డిసెంబర్ 28 న్యూస్ మేట్ : విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 77 తక్షణం రద్దు చేయాలని తెలుగునాడు విద్యార్థి విభాగం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు టి రవితేజ డిమాండ్ చేశారు. జిఓ నెంబర్ 77 ని నిరసిస్తూ సోమవారం హెచ్ సీ ఎం కాలేజీ దగ్గర నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 2020- 21 సంవత్సరానికి పీజీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ సెల్ప్ ఫైనాన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన విద్యా వసతి వర్తించవని ప్రకటించడంతో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఆయన అన్నారు. 2018 -19 2019 -20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జీవో నెంబర్ 77 ప్రవేశపెట్టి బలహీనవర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని ఆయన కోరారు. జీవో నెంబర్ 77 రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి నాయకులు ఎం పవన్ వెంకటేష్ యశ్వంత్ సుధీర్ రామరాజు వినయ్ శివ రాజేష్ శ్రీను మన్నేపల్లి హరికృష్ణ అంకరాజు తదితరులు పాల్గొన్నారు.