రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపండి
కందుకూరు డిసెంబర్ 28 న్యూస్ మేట్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టిడిపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గోచి పాతల మోషే రోజు అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సిపిఐ, టిడిపి, రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టిడిపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మోషే మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అంటారు రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుందని అలాంటి రాష్ట్రంలో గత 19 నెలల్లోనే దాదాపు 756 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్య లు అత్యంత బాధాకరమని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యాలు రైతుల్ని ఇంకా అప్పుల ఊబిలో చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం వన్ వాస్తవ పరిస్థితుల విషయంలో మాత్రం ఎనలేని నిర్లక్ష్యం చూపుతోందని ప్రకటనలపై చూపించే శ్రద్ధ ఆత్మహత్యలు నివారించటంలో చూపించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పరిహారంగా అందించలేదని ప్రస్తుత ప్రభుత్వం దీనిని ఏడు లక్షల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది కానీ క్షేత్ర స్థాయిలో కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అది కూడా వాలంటీర్లు వైసీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే అందిస్తున్నారని వాదన ఉందని ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రతి బాధిత కుటుంబానికి పూర్తి నష్టపరిహారం అందించేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని అందించటంలో ఆలస్యం చేయటం ద్వారా ప్రభుత్వం వారిని మరింత పైకి గురిచేస్తోందని ఆత్మహత్య చేసుకున్న వారంలోనే బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలని ఆయన అన్నారు దీనికి సంబంధించి తగిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి బాలకోటయ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్, ఏఐటీయూసీ నాయకులు సుభాను, టిడిపి నాయకులు మాదాల మాల్యాద్రి, నాగేశ్వరరావు,మల్లేశ్వరరావు,కోటయ్య, రైతు సంఘం నాయకులు u.మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.