ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకి.. తెలుగు రైతు నాయకుల ఆరోపణ

ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకి.. తెలుగు రైతు నాయకుల ఆరోపణ

28/12/20
ఒంగోలు టౌన్ డిసెంబర్ 28 న్యూస్ మేట్ :  తుఫాన్ లో దెబ్బతిన్న ప్రతి పంటలు కాపాడతామని రంగుమారిన ధాన్యం కొంటామని హామీ ఇచ్చి పంటలు దెబ్బతిని ఇంతకాలమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బలగాని వెంకటనారాయణ అన్నారు. రైతు కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయ ఏవో కి వినతి పత్రం సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న పాలన లో 2018లో 664 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019లో 1019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు .దేశంలో అత్యధికంగా రైతులు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలవడం వ్యవసాయం పట్ల జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోందని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుందని ఆయన అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల గురించి రైతు సంక్షేమం గురించి పెద్ద పెద్ద ప్రకటనలు వేసుకుంటున్న ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు మాత్రం ఎంతో నిర్లక్ష్యం చూపుతోందని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యల నివారణ లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు .తెలుగుదేశం ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిని 7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వాస్తవ రూపంలో రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం అందించడంలో ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వం వారిని మరింత నిస్సహాయతకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, రైతు సంఘం నాయకులు గుర్రాల రాజు విమల్ కొఠారి నాగేశ్వరరావు డి ధర్మ నండూరి చంద్ర పాతూరు పుల్లయ్య చౌదరి వల్లూరు చిన్న వెంకటేశ్వర్లు నగర్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కసుకుర్తి అంకరాజు శ్యామ్ బండారుమధన్ ఉండవల్లి రాము మన్నేపల్లి హరికృష్ణ కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు బలగాని వెంకటేశ్వర్ రావు నారాయణ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *