పట్టణంలోనే ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు
కందుకూరు డిసెంబర్ 28 న్యూస్ మేట్ : ప్రభుత్వం ఏర్పాటుచేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్వర్ణకార కార్మిక సంఘం నాయకులు బొల్లోజు బ్రహ్మచారి సోమవారం సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ కు వినతి పత్రం సమర్పించారు .హాస్పటల్లో డాక్టర్ స్టాప్ ఐదుగురు ఉంటారని ఉదయం 10 గంటలకు వెళ్తే కంప్యూటర్ రిజిస్టరు చేస్తారని తర్వాత మందులు ఇవ్వకుండా సాయంత్రం నాలుగు గంటల వరకు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు .సబ్ కలెక్టర్ ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.