నెరవేరబోతున్న ప్రతి పేద వాడి సొంతింటి కల.
వలేటివారిపాలెం డిశంబరు 29 న్యూస్ మేట్ : తన సుదీర్ఘ పాదయాత్రలో సొంత ఇల్లు లేని లక్షలాదిమంది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరి కళను తీరుస్తున్నాడని వైసిపి నాయకుడు దాచర్ల రాఘవ అన్నారు. మండలంలోని నూకవరం గ్రామం లో ఇళ్ల పట్టాభిషేకం కార్యక్రమానికి తహసీల్దార్ ముజఫర్ రెహమాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఏ ఒక్కరు పేదవాడికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వలేక పోయారని గుర్తు చేశారు. అయితే పాదయాత్రలో లక్షలాది మంది నిరుపేద ప్రజలు దశాబ్దాలు గడుస్తున్నా సొంత ఇల్లు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా వీక్షించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు చంద్రమౌళి, కొల్లూరి నరసయ్య,దాచర్ల వెంకటరావు, వీఆర్వో మస్తాన్, కార్యదర్శి ఆదినారాయణ, సచివాలయ కార్యదర్శి వేణు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.