నవరత్నాలలో అందరికీ ఇల్లు………..వైసిపి నాయకులు
వలేటివారిపాలెం డిశంబరు 29 న్యూస్ మేట్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల లలో భాగంగా అందరికీ ఇల్లు అందించాలనే ధ్యేయంతో పని చేస్తున్నారని అత్తింటివారిపాలెం వైసిపి నాయకులు తోకల నరసింగరావు, కొల్లూరి నరసయ్య,కంచర్ల కోటయ్య,కంచర్ల వేణుగోపాల్,కొల్లూరి గోవిందు,మద్దాలి రామారావు,బొమ్మల మాలకొండయ్య అన్నారు. మండలంలోని అత్తింటివారిపాలెం లో తహసీల్దార్ ముజఫర్ రెహమాన్ అధ్యక్షతన ఇళ్ల స్థలాల పట్టాల కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇల్లులేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కళ నెరవేరే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజఫర్ రెహమాన్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, వర్క్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, విఆర్వో, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.