పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం ..ఎమ్మెల్యే సుధాకర్ బాబు

పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం ..ఎమ్మెల్యే సుధాకర్ బాబు

29/12/20

సంతనూతలపాడు డిసెంబర్ 29 న్యూస్ మేట్ : ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షలకు పైగా నివేశన స్థలాల పంపిణీ చేస్తూ చరిత్రలో రికార్డు నెలకొల్పుతున్నారు అని సంతనూతలపాడు ఎమ్మెల్యే టి సుధాకర్ బాబు అన్నారు. మంగళవారం సంతనూతలపాడు మండలం పి గుడిపాడు లో ఆయన పేదలకు పట్టాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేద ప్రజలను చులకనగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు గర్వంగా నిలబడే విధంగా సొంతింటి కల సాకారం చేస్తున్నారని అన్నారు. పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలాలు లోను తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ప్రభాకర్ రెడ్డి మండల వైసీపీ కన్వీనర్ దుంప చెంచి రెడ్డి తహసిల్దార్ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *