నిబద్ధత నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి బ్రహ్మనాయుడు

నిబద్ధత నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి బ్రహ్మనాయుడు

01/01/21

పొన్నలూరు జనవరి 1 న్యూస్ మేట్ : పోలీసు వ్యవస్థ ప్రతిష్టను ప్రజల్లో రెట్టింపు చేస్తూ విధినిర్వహణలో నిబద్ధత నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి బ్రహ్మనాయుడు అని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు పి మాలకొండయ్య అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పొన్నలూరు గా పోలీసు స్టేషన్లో శుక్రవారం బ్రహ్మనాయున్ని మాలకొండయ్య శాలువాతో సన్మానించారు .ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ సమాజంలో పెరిగిపోతున్న అసాంఘిక కార్యక్రమాలను నిరోధించటంలో బ్రహ్మనాయుడు ముందున్నారని కొనియాడారు. ఏ పోలీసు అధికారి అయినా ప్రజల సహకారం ఉంటే సమాజంలో జరిగే చెడుని తుంచి వేయవచ్చని అన్నారు. ఎస్సై బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజల సహకారం ఉన్నంతకాలం ఏ అధికారి అయినా నిబద్ధత నిజాయితీతో పని చేయగలుగుతారని అన్నారు. తాను విద్యార్థి దశ నుండే నలుగురికి సహాయపడే మనస్తత్వాన్ని అలవరుసుకున్నానని గుర్తు చేశారు .జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రత్యేకత సంపాదించుకున్నారని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సామాజికంగా విద్యాపరంగా చైతన్యవంతులైనపుడు సమాజం త్వరితంగా అభివృద్ధివైపు పరుగు తీస్తుందని బ్రహ్మనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు షేక్ హుస్సేన్ పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *