జర్నలిస్టులకు అన్యాయం చేస్తే మంత్రి కమిషనర్ ఎలా తిరుగుతారు చూస్తాం.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు

జర్నలిస్టులకు అన్యాయం చేస్తే మంత్రి కమిషనర్ ఎలా తిరుగుతారు చూస్తాం.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు

01/01/21

ఒంగోలు జనవరి 1 న్యూస్ మేట్ : రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా పాత్రికేయులకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోయినా జర్నలిస్టులను ఎవరు జర్నలిస్టు కాదని అనలేరని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అక్రిడిటేషన్ లపై అడ్డగోలు నిబంధనలతో జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచిందని ఆయన అన్నారు. జర్నలిస్ట్ లకు జరుగుతున్న అన్యాయం పై నూతన సంవత్సరం మొదటి రోజు నుండే సమర శంఖం పూరిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జర్నలిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే సమాచార శాఖ మంత్రి సమాచార శాఖ కమిషనర్ జిల్లాలో తిరగండి మేమంటే ఏమిటో చూపిస్తామంటూ ఆయన మండిపడ్డారు. జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ సత్తా ఎలా ఉంటుందో ప్రభుత్వంలో అవినీతిని పెకలిస్తామని తెలిపారు. మేము తలుచుకుంటే సమాచార శాఖ మంత్రి తిరిగి మచిలీపట్నం ఎమ్మెల్యేగా మిగలాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కేసులు ఉన్న రాజకీయ నాయకులు మంత్రులుగా పని చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉంటే వ్యవస్థ మొత్తం మీద కత్తి కడతారా అని మంత్రిని ఆయన నిలదీశారు. జర్నలిస్టులు శాశ్వతం ప్రభుత్వం ఉంటుంది పోతుంది అక్రిడిటేషన్ లేకపోయినా జర్నలిస్టు జర్నలిస్టే అని ఆయన తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ తత్వాన్ని ప్రదర్శిస్తే జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని జర్నలిస్టులకు ఓటు హక్కు ఉందని జర్నలిస్టులకు జరిగిన అన్యాయాన్ని మేధావులు ప్రజల ముందు ఉంచి ప్రభుత్వ పనితీరుని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశత్వానికి స్వస్తి పలికి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *