ఐ ఎఫ్ సి పౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ : కందుకూరు ఐ ఎప్ సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవత్సరం నుండి 15 మంది నిరుపేదలకు,వితంతవులకు ప్రతి నెల 1వ తారీకు ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తుంది.ఈ రోజు జనవరి ఒకటి శుక్రవారం నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సాజిద్, సెక్రటరీ షంషీర్,ఆర్గనైజర్ రహీమ్, హాఫీజ్, ముతహర్,ఉస్మాన్, జియా. పాల్గొన్నారు