ఎస్.జె.డబ్ల్యు.హెచ్.ఆర్.సి ప్రకాశం జిల్లా ఛైర్మన్ గా పరుచూరి మాధవరావు నియామకం
కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ : సోషియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రకాశం జిల్లా ఛైర్మన్ గా పరుచూరి మాధవరావును జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ అధికారికంగా నియమిస్తూ శుక్రవారం నూతన సంవత్సరం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాధవరావు కందుకూరు నియోజకవర్గ ఛైర్మన్ గా విధులు నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం విశిష్ట సేవలందించిన ఆయన్ను జిల్లా ఛైర్మన్ గా నియమించారు. నేషనల్ జనరల్ సెక్రటరీ నీరజ దామెరాకుల, ఏపీ స్టేట్ ఇంచార్జ్ ఎన్. శ్రీనివాసులు నూతనంగా నియమించబడిన మాధవరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎస్.జె.డబ్ల్యు.హెచ్.ఆర్.సి నియమ నిబంధనల ప్రకారం మానవ హక్కుల పరిరక్షణ కోసం మరింత కృషి చేయాలని సూచించారు. భాదితులకు అండగా ఉండాలని ఆయనకు సూచించారు. ప్రజలకు, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు సోషియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతలను బాత్యతతో నిర్వహిస్తానన్నారు. నన్ను ప్రకాశం జిల్లా ఛైర్మన్ గా నియమించిన జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారికి, నేషనల్ జనరల్ సెక్రటరీ నీరజ దామెరాకులకి, ఏపీ స్టేట్ ఇంచార్జ్ ఎన్. శ్రీనివాసులు కి, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.