ముఖ్యమంత్రికి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల కృతజ్ఞతా దినోత్సవం
కనిగిరి జనవరి 1 (న్యూస్ మేట్) : ది .పి.టి.డి వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనవరి 1వ న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసి ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల తరఫున కృతజ్ఞత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ది పి టి డి వై ఎస్ ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కనిగిరి డిపో ఆధ్వర్యంలో ప్రభుత్వ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కేకు కట్ చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు గానూ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి , రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబుకి, స్థానిక శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులలో వెలుగులు నింపిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు చేసిన మేలును మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి మేలు చేస్తారని అలాగే అందరమూ ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.