నేడు దూబగుంట దగ్గర పట్టాల పంపిణీ తాసిల్దార్ సీతారామయ్య
కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ : “నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు” లో భాగంగా కందుకూరు మండలంలో దూబగుంట అర్బన్ లేఅవుట్ నందు శాసన సభ్యులు మరియు మాజీ మంత్రి మానుగుంట మహీధర రెడ్డి శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ శనివారం ఉదయం గం.10.30 లకు ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతారని తాసిల్దార్ సీతారామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు హాజరు కావలసిందిగా కోరారు. వాలంటీర్లు మరియు వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా లబ్ది దారులకు విషయమును తెలియజేసినట్లు ఆయన తెలిపారు