ఒంగోలు పాల డైరీ సహకార చట్టం పరిధిలో కొనసాగించాలి

ఒంగోలు పాల డైరీ సహకార చట్టం పరిధిలో కొనసాగించాలి

03/01/21

ఒంగోలు టౌన్ జనవరి 3 న్యూస్ మెట్ : ఒంగోలు సహకార పాల డైరీ ద్వారానే పాల సేకరణ జరగాలని వివిధ పార్టీల రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఒంగోలు పాల డైరీ నిర్వీర్యం చేయటం రైతు వ్యతిరేక చర్యలో భాగమేనని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఏ విధంగానూ పాల సేకరణలో సహాయ సహకారాలు అందించడం లేదని ఆయన విమర్శించారు. సహకార సంఘాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒంగోలు పాల డైరీ సహకార చట్టం పరిధిలో కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాల నాయకులు హనుమారెడ్డి దుగ్గినేని గోపీనాథ్ హనుమంతరావు చుంచు శేషయ్య చుండూరు రంగారావు లలిత కుమారి పరిటాల కోటేశ్వరరావు రామారావు శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *