టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కందుకూరు జనవరి 3 న్యూస్ మేట్ : ప్రజల కొరకు ప్రజల నుండి వసూలు అవుతున్న ప్రతి పైసా దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కోరారు. ఆయన ఆదివారం తిక్కవరపు రామిరెడ్డి డిగ్రీ కళాశాల లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో పలు సూచనలు చేశారు. భావితరాలకు ఉపయోగపడే కళాశాల అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం చేయొద్దని ఆయన తెలిపారు .ప్రతి పనిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. దాతల సహకారంతో చేపడుతున్న పనులు విమర్శలకు గురి కారాదని ఆయన సూచించారు.