స్త్రీ విద్య వికాసానికి స్త్రీ స్వాతంత్ర జీవనానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన సావిత్రి భాయి ఫూలే 190 వ జయంతి వేడుకలు.

స్త్రీ విద్య వికాసానికి స్త్రీ స్వాతంత్ర జీవనానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం

టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన సావిత్రి భాయి ఫూలే 190 వ జయంతి వేడుకలు.

03/01/21
ఒంగోలు టౌన్ జనవరి 3 న్యూస్ మేట్ :  నేటి సమాజంలో మహిళలు సావిత్రి భాయి పూలే ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఒంగోలు పార్లమెంటు టి.డి.పి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు సావిత్రిబాయి పూలే 190 వ జయంతి వేడుకలు ఆదివారం టిడిపి కార్యాలయంలో జరిగాయి.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్త్రీ విద్య వికాసానికి స్త్రీ స్వాతంత్ర జీవనానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం అని అన్నారు. నేటి సమాజంలో కోట్లాదిమంది మహిళలు విద్యనభ్యసించి స్వయంప్రతిపత్తిగా జీవించటానికి పునాదిరాళ్లు వేసిన సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం అని మారుతున్న నేటి సమాజంలో సావిత్రిబాయి పూలే వంటి మహిళలు ముందుకు రావాలని నూకసాని పిలుపునిచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు ఆమె జయంతి వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర కేంద్ర మహిళా సంఘాలు జిల్లాస్థాయిలో నిర్వహించి నేటి తరానికి సావిత్రిబాయి పూలే జీవితాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. స్త్రీ క్షేత్ర స్వరూపిణి అని విద్య ద్వారానే శక్తిస్వరూపిణిగా మారుతుందని విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి తానే మొదటి ఉపాధ్యాయురాలిగా స్త్రీ సంక్షేమం కొరకు ఆమె చేసిన సేవలు మరువలేనివని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కామరాజుగడ్డ కుసుమకుమారి, పొదిలి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ఒంగోలు నగర మహిళ అధ్యక్షురాలు పసుపులేటి సునీత, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు నావురి కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, విలేజ్ ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ దాసరి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకులు కేసిన శేషమ్మ, మంగపాటి ప్రశాంతి, కొక్కిలిగడ్డ లక్ష్మి, నల్లూరి నాగేశ్వరమ్మ, దుర్గా మల్లేశ్వరి, ఆరిఫా, అంజమ్మ, దుర్గ, నూతలపాటి పవన్, పూసపాటి జాలి రెడ్డి, శ్రీను, పి.పవన్, మన్నేపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *