సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే
కందుకూరు జనవరి 3 న్యూస్ మేట్ : సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు) 2021 సంవత్సరం క్యాలెండర్ డైరీ లను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మహీధరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులను తయారు చేయడం ద్వారా సమాజంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురుతరమైనదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ టి యు ప్రకాశం జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసులు కోశాధికారి కే కృష్ణ జోనల్ కన్వీనర్ వై అశోక్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు కరణం శ్రీనివాసరావు బి కొండయ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముల్లూరు మల్లికార్జునరావు మేకల మోహన్ రావు మాజీ కౌన్సిల్ సభ్యులు బి కృష్ణయ్య ఎస్టియు నాయకులు ఎన్ వి మాల్యాద్రి సత్యనారాయణ కే శ్రీనివాసరావు యు శ్రీనివాసరావు యు సాయిరాం ఎస్ కె బాబు ఎన్ రామయ్య జాన్సన్ కందుల శ్రీను జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కందుకూరు పట్టణం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్ టి యు కందుకూర్ జోన్ తరఫున 30 వేల రూపాయలు ఎమ్మెల్యే కి అందజేశారు. అనంతరం ఎస్టియు నాయకులు కందుకూర్ డి.ఎస్.పి శ్రీనివాసరావు కలిసి క్యాలెండర్ పుష్పగుచ్చం అందజేశారు