జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు సరిరారెవ్వరు..మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు సరిరారెవ్వరు..మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి05/01/21

పామూరు జనవరి 5 న్యూస్ మేట్ :  పామూరు పట్టణానికి చెందిన నివేశన స్థలాల కు అర్హులైన1,300 మందికి నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం మండల పరిధిలోని గుమ్మలంపాడు గ్రామం వద్ద మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి వైసిపి కార్యకర్తలు నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జగనన్న కాలనీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, జగనన్న కాలనీలో నిర్మించనున్న గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని లబ్ధిదారునికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లో రాష్ట్ర ఎనర్జీ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.18 నెలల కాలంలోనే అర్హులైన 31 లక్షల మంది పేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ది అన్నారు. ప్రతిపక్షాలు కుట్ర పన్ని జగన్ ని అప్రతిష్టపాలు చేసేందుకు పనిచేస్తున్నాయని, చంద్రబాబు గ్రామాల్లోని గుళ్ళను పడగొట్టేందుకు దొంగలను పంపిస్తున్నారని, గ్రామాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండి అలాంటి దొంగలను తరిమికొట్టాలని సూచించారు. కనిగిరి నియోజకవర్గంలో త్వరలోనే ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీ ఆమోదిస్తేనే అన్నీ పనులు జరిగేవని, కానీ నేడు గ్రామ వాలంటీర్లు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పలాలను ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కనిగిరి నియోజకవర్గంలో సుమారు 13 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్న బుర్ర మధుసూదన్ యాదవ్ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *