దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఆపాలి
కావలి జనవరి 5 (న్యూస్ మేట్): దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య వైఖరి వీడాలని పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎస్ సి, ఎస్ టి కేసులు బనాయించారని ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి ప్రసాద్ మాట్లాడుతూపులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపిన దుండగులను ఇంతవరకు అరెస్టు చేయకపోగా తిరిగి వారిని పంచాయితీకని పిలిపించి దౌర్జన్యకర మాటలతో మాట్లాడివారికి అండగావున్నదళిత మహిళా నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకేసు పెట్టడం న్యాయమా అని మండిపడ్డారు.అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని అన్నారు.కావలి తెలుగు దేశం పార్టీ యస్సీ సెల్ అధ్యకులు దావులూరి దేవకుమార్ మాట్లాడుతూప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు తీవ్రమైనాయి అని అన్నారు.కక్ష సాధింపు చర్యలను ఆపాలని, దళితుల పట్ల వివక్ష తగదని అన్నారు.