పేదల సొంతింటి కల జగన్ తో సాధ్యం – జలదంకి వైసిపి నేత జనార్దన్ రెడ్డి

పేదల సొంతింటి కల జగన్ తో సాధ్యం – జలదంకి వైసిపి నేత జనార్దన్ రెడ్డి05/01/21

కావలి జనవరి 5(న్యూస్ మేట్): పేదల సొంతింటి కల సాధ్యం చేయడం ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యం అవుతున్న దని జలదంకి వైసిపి నేత చేవూరు జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారంసోమవరప్పాడు లో అర్హులైన పేదలకు ఆయన ఇళ్ళ పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలతో పాటు కోరుకున్న వారికి ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు త్వం చేపట్టిన ఈ కార్యక్రమం 20 వ తేదీ వరకు దశల వారీగా సాగుతోందని అన్నా రు. అన్ని వర్గాల ప్రజల కు న్యాయం చేసే దిశలో జగన్ పాలన సాగుతోందని,ఆయన బాటలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజలందరూ జగన్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, సంక్షేమంతో సంక్రాంతి కూడా ఘనంగా చేసుకోనున్నారని జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *