సుపరిపాలన జగనన్న కే సాధ్యం ..మంత్రి గుమ్మనూరు.

సుపరిపాలన జగనన్న కే సాధ్యం ..మంత్రి గుమ్మనూరు.05/01/21

దుత్తలూరు జనవరి 5 న్యూస్ మేట్ :  రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సుపరిపాలన జగనన్న కే సాధ్యమని ఏ.పి.కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కొని యాడారు.మంగళవారం దుత్తలూరు మండలం నందిపా డు లో వాల్మీకి కుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూసాము కానీ జగనన్న పాలనాలోప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్ లు పెట్టిన ఘనత జగన్ దే అని సభాముఖంగా తెలియజేశారు .ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కు కృషి చేస్తున్నామని ఈ ప్రాంత ప్రజలకు 75శాతం ఉద్యోగాలు తప్పక ఇస్తామని సభలో ప్రజలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు.అనంతరం వాల్మీకి యూత్ మంత్రిని గజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏ.పి.వాల్మీకి.(బోయ) స్టీరింగ్ కమిటీ చైర్మన్ పిక్కిలి రవీంద్రబాబు,వైసీపీ మండల కన్వీనర్ వాసిపాల్లి వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు మండ్ల శ్రీని వాసులు,కనసాని సుబ్బారెడ్డి, ఏ. వెంగళ్రెడ్డిలు,వైసీపీ నాయకులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉండేలా.గురవారెడ్డి,కామేశ్వర రెడ్డి, కావలి సునీల్ వాల్మీకి,భోగ్యం శంకరయ్య మరియు వాల్మీకి నాయకులు,వైసీపీ నాయకులు,మహిళలు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *