టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న డాక్టర్ నూకసాని బాలాజీ

టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న డాక్టర్ నూకసాని బాలాజీ 05/01/21
ఒంగోలు టౌన్ జనవరి 5 న్యూస్ మేట్ :  పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతంపై చర్చించిన అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాలాజీ చంద్రబాబు తో పలు అంశాలపై చర్చించారు.నూకసాని పనితీరును చంద్రబాబు ప్రశంసించారు.మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కి ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటు పరిధిలో పార్టీ పరిస్థితి గురించి నూకసాని తో చర్చించారు. రైతు కోసం టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు పర్యటన విజయవంతం కావడం లో విజయం సాధించిన నూకసాని ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. పార్టీలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలు ప్రశ్నించి వివరాలు సేకరించారు. ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతంపై కృషి చేయాలని, నిరంతరం కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల కు అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు నూకసాని బాలాజీ కి సూచించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *