ఘనంగా లూయీస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

ఘనంగా లూయీస్ బ్రెయిలీ జయంతి వేడుకలు 05/01/21
ఒంగోలు టౌన్ జనవరి 5 న్యూస్ మేట్ : అంధులకు లిపిని కనిపెట్టి కొత్త జీవితాలను ప్రసాదించిన లూయీస్ బ్రెయిలీ 212 వ జయంతిని మండవ మురళీ క్రృష్ణ నిర్వహణలోని సూర్య శ్రీ దివ్యాంగుల ట్రస్టు కార్యాలయంలో మంగళవారం అంధులు, దివ్యాంగుల మధ్య నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ లూయీ బ్రెయిలీ తన నాలుగేళ్ళ వయసులో ప్రమాధవశాత్తు తన చూపు కోల్పోయాడు అని అన్నారు.బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు అని ఆయన తెలిపారు.అంధుల లిపి కోసం కృషిలో భాగంగా..పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు. అంధులకు పుస్తకాలు ప్రింటుచేయడానికి అంతవరకు ఉన్న విధానాలు బ్రెయిలీకు లోపభూయిష్టంగా కనబడ్డాయి. అంధులకు చూసే అవకాశం లేదు. కనుక ఆ ప్రింటింగు విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి వుండాలని గ్రహించాడు. ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుండాలని భావించాడు. ఒక గీతగా కాకుండా, చుక్కలు చుక్కలుగా వుంటే చదవటం తేలిక అని బ్రెయిలీ భావించి 6 చుక్కలుతో తేలికైన లిపిని స్రృష్టించి అంధుల కళ్ళల్లో వెలుగులు నింపాడన్నారు.ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు,చైతన్య స్రవంతి అధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు,ప్రముఖ రచయిత మొగిలి దేవప్రసాద్, కొమ్మి రమణయ్య లకు ట్రస్టు నిర్వాహకులు సేవా పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. షేక్ సర్ధార్ బాషా,షహరాజ్,రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *