దీపాలు వెలిగించండి మహాప్రభో.. ఉదయగిరి ప్రజల ఆవేదన

దీపాలు వెలిగించండి మహాప్రభో.. ఉదయగిరి ప్రజల ఆవేదన05/01/21
ఉదయగిరి జనవరి 7 (న్యూస్ మేట్ ) : నియోజకవర్గ కేంద్రం అయిన ఉదయగిరిలో ఒక్కటంటే ఒక్క వీధి దీపం వెలగక పోవడంతో కనీసం మెయిన్ బజార్లో అయినా వీధి దీపాలు వెలిగించండి మహా ప్రభువు అంటూ ఉదయగిరి ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గ కేంద్రం, పట్టణ ప్రాంతం, మేజర్ పంచాయతీ అయినప్పటికీ ఉదయగిరి లోని మెయిన్ బజార్లో అంధకారం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామపంచాయతీ పరిధిలో ఉండగా అధికారులే వీధి దీపాలు మార్పించడం మరమ్మతులు చేయించటం చేసేవారు. కానీ అలా కాకుండా వీధి దీపాల నిర్వహణ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో కి మార్చిన తర్వాత ప్రజలకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఉదయగిరి మండలం జి చెర్లోపల్లి కి చెందిన కాంట్రాక్టర్ కనుచూపుమేర కనిపించకపోవడం నిర్వహణ బాధ్యతలు పట్టించుకోకపోవడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పట్టణ ప్రాంతం కావడంతో రాత్రి పది గంటల వరకు వివిధ పనుల రీత్యా స్థానికులు వస్తుంటారు.చలికాలం కావడంతో రోడ్ల మీదకి విషపు కీటకాలు సైతం వస్తున్నాయని చీకటిలో వాటిని గుర్తించలేక అనేకమంది జెర్రీ తేలు పాము కాటుకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉదయగిరి నుంచి స్టేట్ పేటకు, బీసీ కాలనీ కి వెళ్లాలంటే ట్యాంక్ బండ్ దాటుకొని వెళ్లాలని ట్యాంక్ బండ్ మొత్తం అంధకారంలో ఉండడంతో చెరువు నిండి ఉండడంతో విషపు పురుగులు ఆనకట్ట పై సంచరిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఉదయగిరి మెయిన్ బజార్కు వెలుగులు ప్రసాదించాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *