హెచ్.ఐ. వి.పై అవగాహన కార్యక్రమం
ఉదయగిరి జనవరి 5(న్యూస్ మేట్ ) : దుత్తలూరు మండలంలోని సోమలరేగడ గ్రామంలోసచివాలయంలో మంగళవారం హెచ్.ఐ. వి.పై చెయిల్డ్ ఫండ్ లింక్ వర్కర్ స్కీ మ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జోనల్ సూపర్వైజర్ సుబ్బారావు మాట్లాడుతూ హెచ్.ఐ. వి.ఉన్న వారి పట్ల చిన్నచూపు చూడకూడదు అని వారిపిల్లలను స్కూల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం నుంచి రావాల్సిన పింఛను తోపాటు ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూడాలని కోరారు. హెచ్ఐవి ఉన్న వారి పట్ల ఎవరైనా చిన్న చూపు చూసినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలనితెలిపారు. హెచ్ఐవి అనేది నాలుగు రకాలుగా వ్యాపిస్తుందని కలుషిత సూదులు, సిరంజీలు, కలుషిత రక్త మార్పిడితోపాటు హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తుందని హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదు అంటించు కునే వ్యాధి అని వారితో కలిసి భోజనం చేయడం వలన కలిసి జీవించడం వలన దోమకాటుకు కాని మరుగుదొడ్ల వల్లకాని వ్యాధి వ్యాపించదని అన్నారు. అలాగే క్షయ వ్యాధి పట్ల కుడా అప్రమత్తం గా ఉండాలి అని అది రెండు వారాల పై పొడి దగ్గు, జ్వరం రావడం దగ్గినప్పుడు తేమడ కల్లె పడటం ఆకలి బరువు తగ్గడం టీబి లక్షణాలు అని హెచ్ ఐ వి ఉన్న వారికి టి బి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్ ఐ వి సోకిన వ్యక్తి టీబి పరీక్ష కచ్చితంగా చేయించుకోవాలని సూచుంచారు. ఈ కార్యక్రమంలో సచివాలయం పంచాయతీ సెక్రటరీ నాగరాజు చైల్డ్ ఫన్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ జోనల్ సూపర్వైజర్ సుబ్బారావు, సి ఎల్ డబ్ల్యూ కార్తీక్, సచివాలయం సిబ్బంది అంగన్వాడి ఏఎన్ఎం ఆశ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.