పేదలకు అందించే ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణీత్ రెడ్డి ఆరోపణ

పేదలకు అందించే ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణీత్ రెడ్డి ఆరోపణ06/01/21
ఒంగోలు జనవరి 6 న్యూస్ మేట్ :  ఒంగోలు నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ,పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు.నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా నివేస స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలులోని 12వ డివిజన్ లోని రంగుతోటలో నిర్వహించారు. కార్యక్రమానికి బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య ఆతిధిగా విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రణీత్ రెడ్డికి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులో వేయడం వల్ల ఒంగోలు ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే యర్రజర్ల ప్రాంతంలో అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని అన్నారు.ఒంగోలు తహసీల్దార్ టి.చిరంజీవి మాట్లాడుతూ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత ముఖ్యమైన పధకం పేదలందరికి ఇళ్ల కార్యక్రమం అన్నారు.ఒంగోలు మండలంలో 8 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఒంగోలులో పట్టణ ప్రజలకు యర్రజర్ల ప్రాంతంలో24 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు యర్రజర్ల వద్ద ఎనిమిది వందల ఎకరాలలో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న తరుణంలో కోర్ట్ తాత్కాలిక ఉత్తర్వులతో ఇళ్ల పట్టాల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడడంతో ప్రజలకు భరోసా ఇచ్చే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు భరోసా పత్రాలను అందిస్తున్నారని తెలిపారు. అతిత్వరలోనే న్యాయ సమస్యలు తొలగిపోతాయని అన్నారు.న్యాయ సమస్యలు తొలగిపోయిన వెంటనే భరోసా పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇచ్చిన సందేశాన్ని తహసీల్దార్ చిరంజీవి ప్రజలకు వివరించారు.అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలులో 24వేల మందికి ఇళ్ల పట్టాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్ట్ కు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం యువ నాయకులు ప్రణీత్ రెడ్డి చేతులు మీదుగా లబ్ధిదారులకు భరోసా పత్రాలను అందజేశారు.అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ యువ నాయకులు ప్రణీత్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కటారి లక్ష్మణ,కటారి ప్రసాద్,కొమ్మనబోయిన నాగేశ్వరరావు, కాలే వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు నజీర్ తోపాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *