పేకాట శిబిరంపై పోలీసుల దాడి: 9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
గిద్దలూరు జనవరి 6 న్యూస్ మేట్ : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు ఎస్సై రవీంద్రారెడ్డి పేకాట శిబిరంపై బుధవారం తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రు 1.93 లక్షలు నగదు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం నేరమని అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నా, పేకాట ఆడుతున్నా సమాచారం అందించాలని ఎస్సై రవీంద్రారెడ్డి కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.